Header Banner

అమెరికాలో ఆకాశాన్ని అంటుతున్న కోడిగుడ్ల ధరలు! తీవ్ర కొరతతో ఇబ్బందులు!

  Thu Feb 13, 2025 22:57        U S A

బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో గత డిసెంబర్‌లో 2.3 కోట్ల కోళ్లను వధించిన అమెరికా అమెరికాలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ధరలు 15 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో మరో 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోడిగుడ్ల కొరత కారణంగా చాలా స్టోర్లలో 'లిమిటెడ్ స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. కొన్ని స్టోర్లలో అయితే, 'నో స్టాక్' బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. కొనుగోలుదారులకు ఒక్కొక్కరికి రెండు లేదా మూడు కోడిగుడ్ల ట్రేలను మాత్రమే విక్రయిస్తున్నారు. అమెరికా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా గత ఏడాది డిసెంబర్ నెలలో సుమారు 2.3 కోట్ల కోళ్లను వధించారు.

 

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

గత ఏడాది జనవరిలో ఒక కోడిగుడ్డు ధర 2.52 డాలర్లు ఉండగా, డిసెంబర్ నాటికి అది 4.15 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం ఆ ధర 7.34 డాలర్లకు చేరుకుందని అమెరికా లేబర్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కోడిగుడ్ల ధర 45 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని సమాచారం.గుడ్ల ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే స్టోర్లలో 'నో స్టాక్' లేదా 'లిమిటెడ్ స్టాక్' బోర్డులు కనిపిస్తున్నాయి. కోడిగుడ్ల కొరత, ధరల పెరుగుదల హోటల్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలా రెస్టారెంట్లు గుడ్డుతో చేసే వంటకాలపై 50 శాతం అదనపు ఛార్జీని విధిస్తున్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరో నామినేటెడ్ పోస్టుపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ! ఆ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గా ఆయన నియామకం!

 

మార్కెట్‌లోకి కొత్త 50 రూపాయల నోటు.. RBI కీలక ప్రకటన.! మరి పాత నోట్ల పరిస్థితి.?

 

వైసీపీకి భారీ షాక్.. ఆ జిల్లాలో కీలక పరిణామం.. టీడీపీలో చేరిన వైసీపీ నేత! 20 కుటుంబాలు ఈరోజు..

 

ఈసారి Valentines Dayకి మీ గర్ల్ ఫ్రెండ్ ని విమానం లో తీసుకువెళ్లండి.. భారీగా డిస్కౌంట్ ఇస్తున్న ఇండిగో! త్వరగా బుకింగ్ చేసుకోండి!

 

ఏపీ మహిళలకు శుభవార్త.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! కొత్త నిర్ణయాలను అమల్లోకి.. ఈ రంగాల్లో వారికి..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #USA #USANews #America #TeluguMigrants #TeluguPeople #IndianMigrants